తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొత్తపల్లిలోని పోలింగ్ కేంద్రంలో ఎన్నికల నిర్వహణ అధికారులు బ్యాలెట్ బాక్స్ మరిచిపోయారు. కొత్తపల్లి పోలింగ్ కేంద్రంలో ఒకటి, రెండు, మూడు వార్డులకు పోలింగ్ జరిగింది. పోలింగ్ అనంతరం మూడు బ్యాలెట్ బాక్సులకు సీలు వేసిన అధికారులు లెక్కింపు కేంద్రానికి బ్యాలెట్ బాక్సు తరలించే వాహనంలో కేవలం రెండు బాక్సులను మాత్రమే ఎక్కించారు. ఇంతలో వాహనం బయల్దేరి వెళ్లిపోవడంతో పోలింగ్ కేంద్రంలో ఉన్న మూడో వార్డు బ్యాలెట్ బాక్సును అక్కడున్న వారు గుర్తించి ఆందోళన చేశారు. దీంతో పోటీ చేసిన ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులకు చెందిన అనుచరులు వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న కొత్తపల్లి ఎస్సై అబ్దుల్ నబీ పోలింగ్ కేంద్రం చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం ఎన్నికల నిర్వహణ అధికారులకు సమాచారమిచ్చి మర్చిపోయిన బ్యాలెట్ బాక్సును లెక్కింపు కేంద్రానికి తరలించారు.
పోలింగ్ కేంద్రంలో.. బ్యాలెట్ బాక్స్ మరిచిన అధికారులు - సర్పంచ్ ఎన్నికల వార్తలు
తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొత్తపల్లిలోని పోలింగ్ కేంద్రంలో అధికారులు బ్యాలెట్ బాక్స్ మరిచిపోయారు. పోలింగ్ కేంద్రం నుంచి లెక్కింపు కేంద్రానికి తరలించకపోవడంతో విషయం తెలుసుకున్న కొత్తపల్లి ఎస్సై అబ్దుల్ నబీ ఎన్నికల నిర్వహణ అధికారులకు సమాచారమిచ్చారు.
పోలింగ్ కేంద్రంలో.. బ్యాలెట్ బాక్స్ మరచిన అధికారులు