ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గన్​తో బెదిరించి సంపాదించాలనుకున్నాడు.. డామిట్​ కథ అడ్డం తిరిగింది - ap crime news

AMERICA MADE GUN SEIZED : చాలా మంది కష్టపడి సంపాదించలేక.. అక్రమ మార్గంలో సంపాదించాలనుకుంటారు. దానికోసం బెదిరింపులకు పాల్పడటం లాంటి పనులు చేస్తుంటారు. ఇక్కడ కూడా ఓ యువకుడు అలానే సంపాదించాలనుకున్నాడు. అయితే నార్మల్​గా బెదిరిస్తే పనులు కావనుకున్న యువకుడు.. గన్​తో ట్రై చేద్దామనుకున్నాడు. అనుకున్నదే తడవుగా గన్​ను కూడా సంపాదించాడు. కానీ ఊహించని రీతిలో పోలీసులకు దొరికిపోయాడు. అతను పోలీసులకు ఎలా దొరికిపోయాడు అనే డౌట్​ మీకొచ్చిందా. ఇంకెందుకు ఆలస్యం. ఇది చదివేయండి..

AMERICA MADE GUN SEIZED
AMERICA MADE GUN SEIZED

By

Published : Jan 19, 2023, 3:11 PM IST

AMERICA MADE GUN : ఓ యువకుడు కోడిగుడ్ల వ్యాపారం చేస్తుంటాడు. డబ్బు ఎక్కువ కావాలనే ఆశతో బెదిరింపులకు దిగుదామనుకున్నాడు. నార్మల్​గా బెదిరిస్తే ఎవరూ లెక్కచేయరు అనుకున్నాడేమో.. వరుసకు బావ అయినా వ్యక్తి దగ్గర గన్​ తీసుకున్నాడు. అయితే మనోడికి ఓ డౌట్​ వచ్చింది. అదేంటంటే ఆ గన్​ పని చేస్తుందా లేదా అని. ఇంకేముంది అర్ధరాత్రి దానిని టెస్ట్​ చేయడానికి పూనుకున్నాడు. అనుకున్నదే తడవుగా మరో వ్యక్తితో కలిసి బైక్​పై నైట్​ రైడ్​కి వెళ్లాడు. అక్కడే ఓ ట్విస్ట్ జరిగింది. అది ఏంటో తెలుసుకోవాలంటే కింద మేటర్​ చదవాల్సిందే..

గన్​తో బెదిరిద్దామనుకున్నాడు.. కానీ పోలీసులకు దొరికిపోయాడు.. ఎలాగంటే?

రాజమహేంద్రవరంలో కొత్తపేటకు చెందిన కేరళ సత్యనారాయణ అలియాస్ శ్రీనివాస్ కోడిగుడ్ల వ్యాపారం చేస్తున్నాడు. వరసకు బావైన విజయనగరానికి చెందిన బొత్స మోహన్ నుంచి 9 MM యుఎస్ మేడ్ తుపాకీని తెచ్చుకున్నాడు. ఈ గన్‌ చూపించి బెదిరించి డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకున్నాడు. తుపాకీ పేలుతుందో...లేదో పరిశీలించేందుకు... ఇంటి పక్కనున్న ఆటో డ్రైవర్ అంబాళ్ల హరిసూర్యతో కలిసి ద్విచక్ర వాహనంపై గురువారం రాత్రి బయటకు వచ్చాడు. అయితే ఆ రూట్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. మనోడి వేషం చూసి డౌట్​ వచ్చిన పోలీసులు తనిఖీ చేయగా.. గన్​తో అడ్డంగా దొరికిపోయాడు. ఇంకేముంది పోలీసులు అరెస్ట్​ చేసి.. నిందితుడి నుంచి ఏడు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details