యానంలోని ఏడేళ్ల కుమార్తె .. కుమారుడితో గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ముమ్మడి శ్రీనివాస్ ఉదంతంలో.. గాలింపు కొనసాగుతోంది. కుమారుడు, కుమార్తె మృతదేహాలు గుర్తించిన పోలీసులు, సిబ్బంది.. శ్రీనివాస్ భౌతిక కాయాన్ని గుర్తించేందుకు విస్తృత గాలింపు చేస్తున్నారు. సీఐ శివ గణేష్ తో పాటు ముగ్గురు ఎస్సైలు మూడు బృందాలుగా గోదావరి పాయల్లో ఉదయం నుంచి ఈ పనిలోనే నిమగ్నమయ్యారు.
పిల్లలతో కలిసి తండ్రి ఆత్మహత్య: కుమారుడు, కుమార్తె మృతదేహాలు లభ్యం - crime news in east godavari dst
ఇద్దరు పిల్లలతో కలిసి యానాం సమీపంలోని గౌతమి గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ముమ్మిడి శ్రీనివాస్ మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీఐ శివ గణేష్ ఆధ్వర్యంలో మూడు బృందాలుగా విడిపోయి మృతదేహాల కోసం వెతుకుతున్నారు. అతని కుమారుడితో పాటు.. కుమార్తె మృతదేహాలను గుర్తించారు.

police searching for missing candidates committed suicide in yanam godavari river