తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలో ఇటీవల మృతి చెందిన ఎన్నారై మృతదేహానికి పోలీసుల సమక్షంలో పోస్ట్ మార్టం నిర్వహించారు. పట్టణానికి చెందిన ఎన్నారై వంకా సురేష్ కుమార్ ఇటీవల మరణించగా....ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటికే ఖననం చేసిన మృత దేహాన్ని బయటకు తీసి వైద్య బృందం పోస్ట్ మార్టం నిర్వహించింది. అనంతరం మృత దేహాన్ని అధికారుల సమక్షంలో మళ్లీ ఖననం చేశారు. ల్యాబ్ నుంచి రిపోర్ట్ అందాక ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని పోలీసులు తెలిపారు.
ఖననం చేసిన ఎన్నారై మృతదేహానికి పోలీసుల సమక్షంలో పోస్టుమార్టం - తుని ఎన్నారై మృతి
తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలో ఇటీవల మృతి చెందిన ఎన్నారై మృతదేహానికి పోలీసుల సమక్షంలో పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో ల్యాబ్ నుంచి రిపోర్ట్ అందాక ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని పోలీసులు తెలిపారు.
ఎన్నారై మృతదేహానికి పోలీసుల సమక్షంలో పోస్టుమార్టం