పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం టేకూరు గ్రామస్థులు.. పోలవరం వెళ్లి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతం కావడం వల్ల గ్రామంలోకి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.
గోదావరి నదిలో నీటి మట్టం పెరుగుతుండటంతో... ప్రాజెక్టు ముంపు గ్రామాలకు నీటి గండం పొంచి ఉందని, గ్రామాలు ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పరిహారం, పునరావాసం చూపకుండా గ్రామాలు ఎలా ఖాళీ చేస్తామని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.