కేంద్రపాలిత పుదుచ్చేరి తీసుకొచ్చిన అన్లైన్ దరఖాస్తు విధానం నిరక్ష్యరాసులను ఇబ్బందుల పాల్జేస్తోంది. యానాం రెవెన్యూశాఖ జారీచేసే అన్ని ధృవీకరణ పత్రాలు ఇకపై ఆన్లైన్లోనే అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇంతవరకు చదువులేనివారు ఎవరో ఒకరిని బతిమలాడి దరఖాస్తు రాయించుకొని అందుకు అవసరమైన గుర్తింపు పత్రాలు జతచేసి అధికారులకు ఇస్తే సాయంత్రానికి కావలసిన ధృవీకరణ పత్రం అందచేసేవారు. కానీ ఇప్పుడు కంప్యూటర్ ద్వారా అధికారిక వెబ్‌సైట్‌కు పంపిస్తే.. వాటిని పరిశీలించి ఆమోదించడానికి రెండుమూడురోజుల సమయం పడుతుంది.. దీనికి తోడు సాధారణంగా ఒక ధృవీకరణకు పదిరూపాయలైతే ఇప్పుడు వంద రూపాయలు పైనే భారం పడుతుందంటున్నారు. ఈ విషయాన్ని పుదుచ్చేరి ఆరోగ్యశాఖమంత్రి మల్లాడి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లగా.. ఆ రాష్ట్ర ముఖ్య కార్యదర్శితో చరవాణిలో మాట్లాడి తాత్కాలికంగా కొత్త విధానాన్ని నిలిపివేసి.. ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఆన్లైన్ దరఖాస్తు విధానంతో... యానం ప్రజలకు అవస్థలు....! - online process
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో నూతనంగా ఆన్లైన్ దరఖాస్తు విధానంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా నిరక్ష్యరాసులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోవడం లేదని వాపోతున్నారు.
ఆన్లైన్ దరఖాస్తు విధానంతో ప్రజలకు అవస్థలు