ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇళ్ల స్థలాల కొనుగోళ్లలో అవినీతి జరిగింది'

తూర్పు గోదావరి జిల్లా బూరిగపూడిలో పేదల ఇళ్ల స్థలాల కొనుగోళ్లలో అవినీతి జరిగిందన్న వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఆ ప్రాంతంలో ఇళ్లు నిర్మిస్తే బూరిగపూడి గ్రామం మునిగిపోతుందని శ్రీనివాసులు అనే రైతు పిటిషన్ వేశాడు. విచారణ రేపటికి వాయిదా పడింది.

petition in high court on free lands to poor
పేదల ఇళ్ల స్థలాల కొనుగోళ్లలో అవినీతి హైకోర్టులో విచారణ

By

Published : May 27, 2020, 3:34 PM IST

తూర్పుగోదావరి జిల్లా బూరిగపూడిలో పేదల ఇళ్ల స్థలాల కొనుగోళ్లలో అవినీతి జరిగిందని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ప్రభుత్వం కొనుగోలు చేసిన 600 ఎకరాల వ్యవహారంలో అవినీతి జరిగిందన్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. కేసుకు సంబంధించి అఫిడవిట్‌ ఇంకా అందలేదని ప్రభుత్వ సహాయ న్యాయవాది అన్నారు. తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది.

ఇళ్ల స్థలాల కొనుగోళ్లలో అవినీతి జరిగిందని శ్రీనివాసులు అనే రైతు హైకోర్టులో పిల్‌ వేశారు. ఆ ప్రాంతంలో ఇళ్లు నిర్మిస్తే బూరిగపూడి గ్రామం మునిగిపోతుందని పిటిషన్ లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో 'మిడతల దండు'యాత్ర!

ABOUT THE AUTHOR

...view details