ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వినాయక నిమజ్జనానికి వెళ్లి..వ్యక్తి గల్లంతు! - తూర్పగోదావరి జిల్లా

వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. వినాయక నిమజ్జనాకి వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ...కాలువలో పడి గల్లంతయ్యాడు.

వినాయక నిమజ్జనానికి వెళ్లి వ్యక్తి గల్లంతు

By

Published : Sep 8, 2019, 9:09 AM IST

వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. బొజ్జగణనాథుడని ఊరేగింపుగా తీసుకెళ్లిన వ్యక్తి గండేపల్లి పోలవరం కాలువలోపడి గల్లంతయ్యాడు. తూర్పుగోదావరి రామయ్య పాలెం గ్రామానికి చెందిన గొల్లవిల్లి శ్రీను( 43) వినాయకుని నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నాడు. గండేపల్లి గ్రామా శివారులో ఉన్న పోలవరం కాలువ వద్ద బ్రిడ్జి పై విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. విగ్రహానికి కట్టిన తాడు విప్పుతుండగా బ్రిడ్జి పక్కనున్న గోడపై కాలు వేసి అదుపు తప్పి పడిపోయాడు. ఎస్ఐ తిరుపతి రావు, తహసీల్దార్ చిన్నారావు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని శ్రీను కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆచూకీ లభ్య కాకపోవడంతో కాకినాడ నుంచి గజ ఈత గాళ్లను తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు.

వినాయక నిమజ్జనానికి వెళ్లి వ్యక్తి గల్లంతు

ABOUT THE AUTHOR

...view details