తూర్పుగోదావరి జిల్లాలో లాక్‌డౌన్ వల్ల దుకాణాలు మూతపడ్డాయి. అక్కడక్కడా దుకాణాలు తెరుచుకున్నా... పోలీసులు, అధికారులు మూసేశారు. లాక్‌డౌన్ దృష్ట్యా ఆదివారం నుంచి హెచ్చరిస్తున్నా ప్రజలు రోడ్లమీదకు వచ్చారు. కొన్ని చోట్ల రద్దీ కనిపించింది. వీరిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావొద్దని కోరారు. రాజమహేంద్రవరంలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు.
ఆంక్షలను పట్టించుకోని జనం....అధికారుల ఆగ్రహం
కరోనాపై పోరులో భాగంగా ప్రభుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్ ప్రకటించినప్పటికీ తూర్పు గోదావరి జిల్లాలో కొన్నిచోట్ల ప్రజలు యథావిధిగా రాకపోకలు సాగించారు. వావానాలతో రోడ్లపైకి వచ్చారు. అప్రమత్తమైన పోలీసులు... దుకాణాలను మూసి వేయించారు. నిత్యావసర వస్తువుల దుకాణాలకు మినహాయింపు ఇచ్చారు.
lockdown in the East Godavari district