30 ఏళ్ల క్రితమే ఇల్లు నిర్మించి రుణం వాయిదాల రూపంలో చెల్లించేశారు. అప్పు తీరిపోయిందంటూ ప్రభుత్వ సిబ్బంది పాసు పుస్తకాలనూ తీసుకెళ్లారు. అయితే ఆ రశీదుల్ని యజమానులు జాగ్రత్త చేయలేదు. ఇప్పుడు మూడు దశాబ్దాల తర్వాత ప్రభుత్వ సిబ్బంది వచ్చి రూ.9 వేల 480 రుణం చెల్లించాలనడంతో ఇంటి యజమానులు నిర్ఘాంతపోయారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఓ ఇంటికి ఓటీఎస్ స్కీం కింద, రుణం చెల్లించాలంటూ వీఆర్వో నందీశ్వరరావు, గ్రామ సచివాలయ సిబ్బంది రావడంతో ఇంట్లోని వారు ఒక్కసారిగా అవాక్కైయ్యారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా డబ్బులు చెల్లించాలనడం ఏంటని యజమానులు నిలదీశారు.
PUBLIC ANGRY ON OTS : ప్రభుత్వాలు మారినప్పుడల్లా డబ్బులు చెల్లించాలంటే ఎలా..!
తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఓటీఎస్ స్కీంపై నిరుపేదలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా డబ్బులు చెల్లించాలంటే ఎలా.. అని నిలదీశారు.
ఓటీఎస్ నిర్ణయంపై పేదలు తీవ్ర ఆగ్రహం
Last Updated : Jan 22, 2022, 11:05 AM IST