కరోనా ఆంక్షల నేపథ్యంలో.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆదివారం రోజున మాంసం, చేపల విక్రయాలపై నిషేధం విధించింది. ఇవాళ శనివారం సందర్బంగా.. మాంసాన్ని కొనుగోలు చేసేందుకు దుకాణాల వద్దకు అధికసంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. ఆర్ట్స్ కళాశాల వద్ద మాత్రం వ్యక్తిగత దూరం పాటించకుండానే కొనుగోలు చేశారు. కూరగాయల దుకాణాల వద్ద మాత్రం నిబంధనలను ప్రజలు పాటిస్తున్నారు.
మాంసం దుకాణాల ముందు జనాలు బారులు
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ.. ఆదివారం రోజున మాంసం, చేపల విక్రయాలపై నిషేధం విధించింది. రేపు ఆదివారం కావడంతో ఈ రోజే మాంసాహార కొనుగోలు చేసేందుకు ప్రజలు దుకాణాల వద్ద బారులు తీరారు.
రాజమహేంద్రవరంలో మాంసం దుకాణాల వద్ద ప్రజల బారులు