గోదావరికి వరద పోటెత్తటంతో...తూర్పు, పశ్చిమ గోదావరి, జిల్లాల సరిహద్దులోని లంక గ్రామాల ప్రజలు పలు సమస్యలతో సతమతమవుతున్నారు. కనకాయ, అయోధ్య, నక్కిడి, కోడేరు, పెదమల్లం, అన్నగారు లంక గ్రామస్థులు నది పాయలు దాటటానికి కనీసం పడవ సదుపాయం లేదని వాపోయారు. పాఠశాలలకు వెళ్లే పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవౌతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇటీవల బియ్యం సరఫరా చేసినా...ఇంట్లో సామాగ్రికైనా నదీ పాయలు దాటాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ పడవలను ఆశ్రయిస్తే...రోజుకి 20 నుంచి 25 రూపాయలు వెచ్చించాల్సి వస్తోందన్నారు. పంచాయతీ అధికారులు చొరవ తీసుకుని పడవలు వేస్తే తమ కష్టాలు తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
గోదావరికి వరద...తీరని లంక ప్రజల ఇక్కట్లు
ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దుల్లోని లంక గ్రామాల ప్రజల సమస్యలు వర్ణనాతీతంగా మారాయి. నిత్యావసర సరుకులకు...ప్రైవేట్ పడవలను ఆశ్రయించి నదీ పాయలు దాటాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
గోదావరికి వరద...తీరని లంక ప్రజల ఇక్కట్లు
TAGGED:
ఉభయ గోదావరి జిల్లాలు