ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పాదయాత్రలు అప్పుడు కాదు.. ఇప్పుడు చేయండి'

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జనసేన అధ్యక్షుడు పవన్​ కల్యాణ్​ అన్నదాతలతో ముచ్చటించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న ఆయన.. వైకాపా ప్రభుత్వం అన్నదాతల సమస్యలపై స్పందించాలని డిమాండ్​ చేశారు. రైతులంటే మట్టి నుంచి కస్తూరి పరిమళాన్ని తీసేవారని ఉద్ఘాటించారు. అన్నం పెట్టే అన్నదాతకు న్యాయం జరిగే వరకూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

pawan kalyan tour in east godavari on  the topic of farmers problems
రైతుల సమస్యలపై మాట్లాడుతున్న పవన్

By

Published : Dec 8, 2019, 2:38 PM IST

రైతులకు న్యాయం జరిగే వరకూ అండగా ఉంటానన్న జనసేనాని

జనసేన అధ్యక్షుడు పవన్​కల్యాణ్​ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించారు. అన్నదాతలతో చర్చించిన ఆయన.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైకాపా సర్కారు రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని పవన్​ మండిపడ్డారు. మట్టి నుంచి కస్తూరి పరిమళాన్ని తీసే శక్తి రైతుకు ఉందన్న జనసేనాని.. వైకాపా నేతలు అన్నదాతల సమస్యలపై స్పందించాలని డిమాండ్​ చేశారు. అన్నం పెట్టే రైతన్నకు న్యాయం జరిగే వరకూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.


'ఓట్ల కోసం పాదయాత్రలు కాదు.. రైతుల కన్నీళ్లు తుడవటానికి ఇప్పుడు పాదయాత్రలు అవసరం. వైకాపా ఎమ్మెల్యేలు రైతుల కన్నీటితో రక్తం కూడు తింటున్నారు. ముఖ్యమంత్రి జగన్​ ఇప్పుడు ప్రజల్లో తిరగాలి. తనకు నిజాలు చెబితే విజిలెన్స్​ దాడులు ఉంటాయని రైస్​ మిల్లర్లను వైకాపా నేతలు బెదిరించారు. జిల్లాలో నా పర్యటన ఖరారు కావటంతో ప్రభుత్వం భయపడింది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన రూ.80 కోట్లను అర్ధరాత్రి విడుదల చేసింది. దీనిపై లోతుగా విశ్లేషణ చేసి రైతు సమస్యలు తీర్చేందుకు ప్రణాళికలు చేస్తాం.' - పవన్‌ కల్యాణ్‌, జనసేన అధినేత

ABOUT THE AUTHOR

...view details