తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం పరిధిలోని లంక గ్రామాల్లో పశువులకు గ్రాసం కరువైంది.గోదావరి వరదలతో పంటచేలు గట్లతో సహా మునిగిపోయాయి.పదిహేను రోజులైనా నీరు తగ్గకపోవటంతో పచ్చ గడ్డి కరువైంది.లంకలోను కొబ్బరి తోటలు,ఇతర మెట్ట ప్రాంతాలు నీట మునగడంతో పశువులను రోడ్లపైకి తరలించారు.పశువులకు దాన అందించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఎండు గడ్డి అందుబాటులో లేక ఇతర ప్రాంతాల నుంచి తీసుకొస్తున్నారు.
పచ్చగడ్డికి అవకాశమేది..లంక గ్రామాల్లో పశుగ్రాసం కొరత
నెల రోజులుగా గోదావరికి వస్తున్న వరదలతో పంటపొలాలన్ని నీట మునిగే ఉన్నాయి. దీంతో పచ్చగడ్డి మొలిసేందుకు అవకాశ లేకపోవడంతో, పశువులు మేత కోసం అల్లాడుతున్నాయి. ముమ్మిడివరం పరిధిలోని గ్రామల్లో పశుగ్రాసాన్ని రైతులు ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి తెచ్చుకోవడం..బాధల్లో బాధగా ఉంది.
పశువులు