తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో ప్రమాదవశాత్తు ధాన్యం కుప్పలు దగ్ధమయ్యాయి. ఓ రైతు తన పొలంలో ఎండు గడ్డిని కాల్చుతుండగా ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న ధాన్యం కుప్పలకు మంటలు అంటుకున్నాయి. దీనితో అక్కడే కుప్పలుగా పోసి ఉన్న నాగభూషణం, అనభాల నాగరాజు, కోప్పన కృష్ణ, మాచెర్ల సుబ్బారావులకు చెందిన వరి కుప్పలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
ఎండుగడ్డిని కాల్చుతుండగా ప్రమాదం..వరి కుప్పలు దగ్ధం
ఎండు గడ్డిని కాల్చుతుండగా ప్రమాదశావత్తు ధాన్యం కుప్పలకు మంటలు అంటుకున్న సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. సుమారు ఏడున్నర ఎకరాల్లో సాగు చేసిన వరిపంట అగ్నికి ఆహుతైంది. దాదాపు మూడు లక్షలకు పైగా పంట నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు.
paddy grains burnt in fire accident east godavari district
ఘటనాస్థలానికి చేరుకున్న ప్రత్తిపాడు ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. సుమారు ఏడున్నర ఎకరాల్లో సాగు చేసిన వరిపంట బూడిద పాలైనట్లు రైతులు తెలిపారు. దాదాపు మూడు లక్షలకు పైగా పంట నష్టం వాటిల్లిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా వీళ్లందరూ కౌలు రైతులు కావడం గమనార్హం. ప్రత్తిపాడు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు.
ఇదీ చదవండి: చెత్తకుప్పలో పోలీస్ టోపీ!