దేశ రాజధానితో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత తీర్చేందుకు అడుగులు పడుతున్నాయి. కేంద్ర పాలిత పుదుచ్చేరి రాష్ట్రంలోని 30 నియోజకవర్గాలలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిడెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ ఆదేశించడంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.
యానాం ప్రభుత్వాసుపత్రికి ఆక్సిజన్ యూనిట్! - East godavari district news
దేశవ్యాప్తంగా కరోనా రోగులకు ఆక్సిజన్ సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా సమీపంలోని కేంద్రపాలిత ప్రాంతమైన యానాం ప్రభుత్వాసుపత్రికి ఆక్సిజన్ యూనిట్ నిర్మాణానికి సంబంధించిన పరికరాలు చేరుకున్నాయి.
యానాం ప్రభుత్వాసుపత్రికి ఆక్సిజన్ యూనిట్
దీనిలో భాగంగా... తూర్పుగోదావరి జిల్లాలో సమీపంలోని కేంద్ర పాలిత యానాం ప్రభుత్వాసుపత్రికి ఆక్సిజన్ యూనిట్ నిర్మాణానికి సంబంధించిన పరికరాలు చేరుకున్నాయి.. దీనిని అమర్చి రోగులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పుదుచ్చేరి నుంచి టెక్నీషియన్లు రావాల్సి ఉందని.. ఈ వారంలో పనులు పూర్తి చేస్తామని యానాం డిప్యూటీ కలెక్టర్ అమన్ శర్మ తెలిపారు.