కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన సుమారు 28 కుటుంబాలు... కొన్నేళ్లుగా తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాడు కాలువ ఒడ్డున గుడారాలు వేసుకుని జీవిస్తున్నారు. ఆ కుటుంబాలకు చెందిన కార్తీక్, నాని అనే ఇద్దరు పిల్లలు ఈ నెల 5న ఆడుకుంటూ అదృశ్యమయ్యారు. సమీప ప్రాంతాల్లో చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్థానికులు గాలించగా... వారి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు... కాలువ పొడవునా గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన ఇద్దరిలో నాని మృతదేహం ఆదివారం ఉదయం లభ్యమవగా... కార్తీక్ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.
అదృశ్యమైన చిన్నారుల్లో ఒకరి మృతదేహం లభ్యం - తూర్పుగోదావరి జిల్లాలో చిన్నారి గల్లంతు
తూర్పుగోదావరి జిల్లా రావులపాడులో 4 రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారులు కాలువలో పడి గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహాన్ని కొత్తపేట మండలం పలివెల కాలువలో గుర్తించారు. మరొకరి కోసం గాలిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో లభ్యమైన చిన్నారి మృతదేహం