ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'స్పందన'లో స్వల్ప తోపులాట..కింద పడిన వృద్ధురాలు

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో స్పందన కార్యక్రమంలో ఓ వృధ్దురాలు క్యూలైన్​​లో కింద పడిపోయింది. హాల్​ కిక్కిరిసి స్వల్ప తోపులాట జరగటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న జేసీ ఆమెను కలెక్టర్​ వద్దకు తీసుకెళ్లారు.

By

Published : Aug 19, 2019, 3:17 PM IST

old-women-fell-down-on-spandana-program

'స్పందన'లో క్యూలైన్‌లో కింద పడిపోయిన వృద్ధురాలు

కాకినాడ కలెక్టరేట్​లోని స్పందన కార్యక్రమంలో ఓ వృద్ధురాలు కిందపడింది. అర్జీ పెట్టుకునేందుకు జగన్నాథపురానికి చెందిన బొమ్మిడి సత్యవతి కలెక్టరేట్‌కు వచ్చింది. సత్యవతి కుమారుడు రెండు నెలల క్రితం అనారోగ్యంతో మరణించాడు. బీమా పథకం కింద రావాల్సిన సొమ్ము రాలేదు. దీనితో 'స్పందన'లో అధికారులను కలసి సమస్యను మొర పెట్టుకునేందుకు కలెక్టరేట్​కు వచ్చింది. దరఖాస్తుదారులు భారీగా తరలిరావడంతో హాలు కిక్కిరిసి స్వల్ప తోపులాట జరిగింది. ఈ తోపులాటలో సత్యవతి కింద పడిపోయింది. విపరీతమైన కాలునొప్పితో బాధపడుతున్న ఆమెను జాయింట్ కలెక్టర్ రాజకుమారి ఆమెను ఓదార్చి.. కలెక్టర్ మురళీధర్ రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. తనకు ఎలాంటి ఆధారం లేదని, బీమా సొమ్ము ఇప్పించి ఆదుకోవాలని సత్యవతి కలెక్టర్‌కు విజ్ఞప్తి చేసింది. సమస్యను వెంటనే పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించి.. ఇంటి వద్ద వదిలి రావాలని సిబ్బందిని ఆదేశించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details