OLD WOMAN DIED : సీఎం సభకు జనాన్ని తీసుకెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటలో రెండు కాళ్లు నుజ్జు నుజ్జై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 70 ఏళ్ల వృద్ధురాలు అర్జి పార్వతి మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గత నెలలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సభ నిర్వహించారు. రాజమహేంద్రవరం గ్రామీణ మండలం నామవరంకు చెందిన వృద్ధురాలు పార్వతి లాలాచెరువు వద్ద రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీ కొట్టి ముందు చక్రం ఎక్కడంతో రెండు కాళ్లు నుజ్జు నుజ్జు అయ్యాయి.
సీఎం సభకు వెళ్తూ వృద్ధురాలును ఢీకొన్న బస్సు.. నెలరోజులు మృత్యువుతో పోరాడి మృతి - old woman seriously injured in cm jagan meeting
OLD WOMAN DIED : గత నెలలో సీఎం జగన్ సభలో ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు పార్వతీ మృతి చెందింది. నెల రోజులుగా మృత్యువుతో పోరాడిన పార్వతి కాకినాడ జీజీహెచ్‌లో చనిపోయారు.
OLD WOMAN DIED
తీవ్రంగా గాయపడ్డ పార్వతిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి.. ఆ తర్వాత కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. రెండు కాళ్లకు శస్త్ర చికిత్సలు చేసి ఎడమకాలు మోకాలు వరకు తొలగించారు. నెల రోజులుగా మృత్యువుతో పోరాడిన పార్వతి కాకినాడ జీజీహెచ్‌లో చనిపోయారు. ఈ ఘటనపై రాజమహేంద్రవరం ప్రకాశ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఇవీ చదవండి:
Last Updated : Feb 3, 2023, 11:34 AM IST