తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో పంటపొలాలు ముంపులోనే తేలియాడుతున్నాయి. ఐదు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పూర్తిగా నీట మునిగాయి. 1365 హెక్టర్లలో వరి, 1159.60 హెక్టర్లలో ఉద్యాన పంటలు నష్టపోయినట్లు అధికారులు అంచనా వేశారు. అత్యధికంగా ఉద్యానవన పంటలు కొత్తపేట నియోజకవర్గంలోని ఆత్రేయపురం మండలంలో660.2 హెక్టార్లలో, కొత్తపేట మండలంలో 252 హెక్టార్లలో రావులపాలెం మండలంలో 103.2 చట్టాలలో పంట నష్టం వాటిల్లింది. వర్షపునీటిలోనే అరటి, కంద, కూరగాయల తోటలు ఉండడంతో కుళ్లిపోయి పాడే పోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోనసీమలో నీట మునిగిన పొలాలు-నష్టాన్ని అంచనా వేసిన అధికారులు - Officials assessed the damage to submerged farms in Konaseema
తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని పంటపొలాలు ముంపులోనే తేలియాడుతున్నాయి. ఐదు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పూర్తిగా నీట మునిగాయి.
కోనసీమలో నీట మునిగిన పొలాలు-నష్టాన్ని అంచనా వేసిన అధికారులు
TAGGED:
MUNPU