ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నూకాలమ్మా... మమ్ము చల్లంగా చూడమ్మా!!

చిన్నారులను కాపాడే దేవతగా... చింతలు తీర్చే తల్లిగా... భక్తుల పాలిట కల్పవల్లిగా పూజలందుకుంటున్న నూకాలమ్మ జాతర మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా చింతలూరులో ఉన్న ఈ ఆలయ ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

By

Published : Apr 4, 2019, 8:33 PM IST

నూకాలమ్మా... మమ్ము చల్లంగా చూడమ్మా!!

వైభవంగా నూకాలమ్మ జాతర
తూర్పుగోదావరిజిల్లాలోజరిగే ప్రధాన తీర్థ మహోత్సవాల్లో నూకాలమ్మ జాతర ప్రముఖమైనది. నెల రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. చిన్నారులను నూకాలమ్మ దేవాలయానికి తీసుకొని వచ్చి... కాగడాలు వెలిగించి కోడి పిల్లలతో వారికి దిష్టి తీయిస్తే మంచి జరుగుతోందని తల్లిదండ్రుల నమ్మకం. అందుకే పిల్లాపాపలతో కలిసి.. భక్తులు అమ్మవారి దర్శనానికి తరలి వస్తున్నారు. మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల కోసం పాలు, మజ్జిగ ఉచితంగా అందించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.

ఆలయ అధికారులు చెప్పిన ప్రకారం.. ఈ సంవత్సరం జరిగే అమ్మ వారి తీర్థ మహోత్సవానికి సుమారు 10 లక్షల భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రాంగణమంతా చలువ పందిళ్లు, విద్యుద్దీపాలతో అలంకరించారు. నేటి రాత్రి జరిగే అమ్మవారి జాగరణకు అన్ని వసతులు సమకూర్చారు. శుక్రవారం తీర్థ మహోత్సవం, 6న ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details