కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చెరిలో ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గత శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ జరుగుతున్నా.. నేటి నుంచే నామినేషన్ సందడి ప్రారంభమైంది.
తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత యానాం అసెంబ్లీ స్థానానికి.. రెండో రోజు 3 నామినేషన్లు దాఖలయ్యాయి. అభిమానులు, కార్యకర్తల ఊరేగింపుతో వచ్చిన గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్.. స్వతంత్ర అభ్యర్థిగా మొదటి నామినేషన్ దాఖలు చేశారు. మరో రెబల్ అభ్యర్థి అల్లూరి రామకృష్ణంరాజు, బహుజన సమాజ్ వాది పార్టీ అభ్యర్థిగా సుంకర కార్తీక్ లు రిటర్నింగ్ అధికారి అమన్ శర్మకు నామపత్రాలు సమర్పించారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా అభ్యర్థులు తెలిపారు.