ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రహదారుల అభివృద్ధికి టెండర్లు పిలిచినా... గుత్తేదారుల స్పందన కరవు' - roads development at amalapuram news

అసలే అధ్వానంగా ఉన్న రోడ్లు.. ఆపై వర్షాలు మొదలయ్యాయి. దీంతో వాహనదారులకు ఇబ్బందితో పాటు రహదారులు మరింత దెబ్బతింటున్నాయి. అయితే.. రహదారుల అభివృద్ధికి నిధులు విడుదలైనా... టెండర్లకు గుత్తేదారుల నుంచి స్పందన లేదని ఆర్​ అండ్​ బీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేంద్ర అన్నారు. ఈ ఫలితంగానే.. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని రోడ్డు నిర్మాణ పనులు చేసేందుకు వీల్లేకుండా ఉందన్నారు.

roads
పాడైన రహదారులు

By

Published : Jun 24, 2021, 5:44 PM IST

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్​లోని రహదారుల అభివృద్ధికి టెండర్లు పిలిచినప్పటికీ గుత్తేదారులు స్పందించటం లేదని ఆర్​ అండ్​ బీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాజేంద్ర తెలిపారు. రాజవరం - పొదలాడ రహదారిని జీ.పెదపూడి నుంచి పి.గన్నవరం వరకు అభివృద్ధి చేసేందుకు ఈ ఏడాది జనవరిలో రూ.24.50 కోట్లు మంజూరయ్యాయి. ఈ రహదారి బాగా దెబ్బతింది. ఇప్పటికీ మూడు సార్లు టెండర్లు పిలిచినా... కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదని రాజేంద్ర అన్నారు.

అలాగే... బొబ్బర్లంక రహదారి అభివృద్ధికి రూ.16 కోట్లు, పి. గన్నవరం నుంచి కే.ముంజవరం రహదారి నిర్మాణానికి రూ.1.20 కోట్లు, ముంగండ నుంచి ముంజవరం రోడ్డు పనులకు రూ.1.50 కోట్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు. వీటి కోసం ఇదివరకొకసారి టెండర్లు ఆహ్వానించినా.. గుత్తేదారులు స్పందించలేదు. ఓ వైపు వర్షాకాలం మొదలైంది. అసలే అధ్వానంగా ఉన్న రహదారులు మరింత దెబ్బతింటున్నాయి. టెండర్లు ఖరారు కాకపోవటంతో రహదారుల పనులు చేయలేకపోతున్నామని రాజేంద్ర తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details