అంతిమ సంస్కారాల సమయంలో నలుగురైనా ఉండాలన్నది నానుడి. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఆ పరిస్థితి దూరమైంది. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలోని గొల్లపల్లికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి కరోనాతో చనిపోయాడు. ఆయనది పెద్ద కుటుంబం... కానీ అంతిమసంస్కారాలకు ఒక్కరూ వెళ్లలేకపోయారు. అతనికి కరోనా సోకిన కారణంగా... కుటుంబంతా ఆసుపత్రిలోనే ఉంది. చేసేదేమి లేక... అమలాపురం మున్సిపల్ కార్మికులు స్మశాన వాటికలో మృతుడికి అంత్యక్రియలు నిర్వహించారు. కడచూపైనా దక్కలేదని మృతుడి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
కడచూపును దూరం చేసిన కరోనా మహమ్మారి
అతనికి అందరూ ఉన్నారు..కానీ అంత్యక్రియలకు ఒక్కరూ హాజరు కాలేని పరిస్థితి. కుటుంబసభ్యులకు కడచూపైన దక్కని దుస్థితి. అనాథ శవానికి జరిపినట్లు అంత్యక్రియలు చేసేశారు మున్సిపల్ సిబ్బంది. కరోనా వల్ల..కడసారి చూపుకూడా నోచుకోలేదని ఆ కుటుంబం కన్నీటిపర్యంతమైంది.
అమలాపురంలో కరోనా మృతదేహం అంత్యక్రియలు