ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఓటమి ఖాయం: నాదెండ్ల మనోహర్ - AP News

ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా వైకాపా పాలన సాగుతోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఓటమి ఖాయమని తెలిపారు. ప్రజలే ఆ పార్టీకి బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.

Nadendla Manohar On Dwarampudi
Nadendla Manohar On Dwarampudi

By

Published : Mar 19, 2022, 7:36 PM IST

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ కాకినాడలోనే కాదు తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తామన్న వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి వ్యాఖ్యలపై... జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఓటమి ఖాయమని తెలిపారు. ప్రజలే ఆ పార్టీకి బుద్ధి చెబుతారన్నారు. ద్వారంపూడి ప్రగల్భాలు మాని కాకినాడ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా వైకాపా పాలన సాగుతోందని మండిపడ్డారు. అధికారంలో ఉన్నాం ఏం మాట్లాడినా.. ఏం చేసినా చెల్లిపోతుంది అనుకుంటే పొరపాటేనని అన్నారు. వైకాపా ప్రభుత్వం కచ్చితంగా మళ్లీ అధికారంలోకి రాదని తెలిపారు.

కాకినాడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాటలు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయని... ఇంత అహంకారం ఎక్కడ నుంచి వచ్చిందో అర్ధం కావడం లేదని ధ్వజమెత్తారు. మా పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్​ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. మా నాయకత్వాన్ని చులకన చేసే విధంగా మాట్లాడితే సహించేది లేదని తెలిపారు.

ఇదీ చదవండి:Police Attacks on Public: పోలీసుల ప్రతాపం..."బాధితులపైనే” ...

ABOUT THE AUTHOR

...view details