సంక్షేమ పథకాల పేరుతో సీఎం జగన్ ప్రజల్ని మోసం చేస్తున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా మలికిపురలో రాజోలు నియోజకవర్గ జనసేన కార్యకర్తలు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. రైతులను పట్టించుకోవడం లేదని, తుపాను వల్ల రైతులు నష్టపోతే వారికి పరిహారం చెల్లించలేదన్నారు. దీనిపై జనసైనికులతో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యలపై పోరాటం చేస్తున్న వారిపై కేసులు పెడుతున్నారన్నారు. బహిరంగ సభకు హాజరవుతున్న జనసేన కార్యకర్తలను పోలీసులు ప్రత్యేక డ్రైవ్ల పేరుతో అడ్డుకోవడం సరికాదన్నారు. రాపాక వైకాపాకు మద్దతిచ్చి రాజోలు నియోజకవర్గాన్ని ఎక్కడ అభివృద్ధి చేశారో చూపాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి కులాల వారీగా ప్రజలను విడగొట్టి పాలిస్తున్నారని ఆరోపించారు. కనీసం పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి ఇసుక కూడా అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు.
సీఎం జగన్ ప్రజలను మోసం చేస్తున్నారు: నాదెండ్ల - రాజోలు జనసేన వార్తలు
సంక్షేమ పథకాల పేరుతో సీఎం జగన్.. ప్రజలను మోసం చేస్తున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా మలికిపురంలో రాజోలు నియోజకవర్గ జనసేన కార్యకర్తలు నిర్వహించిన బహిరంగసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాపాక వైకాపాకు మద్దతిచ్చి నియోజక వర్గంలో ఎక్కడ అభివృద్ధి చేశారో చూపాలని డిమాండ్ చేశారు.
సీఎం జగన్ ప్రజలను మోసం చేస్తున్నారు: నాదెండ్ల
అనంతరం రాజోలు నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో విజయం సాధించిన సర్పంచులను ఘనంగా సన్మానించారు. కార్యకర్తలు ఐక్యంగా ఉండి పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు.