కరోనా ఉద్ధృతి పెరుగుతున్న కారణంగా.. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పట్టణంలో సంపూర్ణ పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు కోరారు. మున్సిపల్ చైర్ పర్సన్ సత్యనాగేంద్రమణి అధ్యక్షతన సమావేశం జరిగింది. వైకాపా ఓడిన వార్డులలో.. ప్రతిపక్ష సభ్యులకు సరైన గౌరవం ఇవ్వకుండా అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని.. జనసేన, తెలుగుదేశం అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
'అమలాపురంలో సంపూర్ణ పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి' - అమలాపురంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం తాజా వార్తలు
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో.. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా.. అమలాపురం పట్టణంలో సంపూర్ణ పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని.. సమావేశంలో కౌన్సిల్ సభ్యులు కోరారు.
municipal council meeting
TAGGED:
municipal council meeting