ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 22, 2021, 12:49 PM IST

ETV Bharat / state

MRO ARREST FOR PLAYING POKER: పేకాడుతూ పట్టుబడిన తహసీల్దార్​

MRO Arrest in east godavari: తూర్పుగోదావరి జిల్లాలోని రాఘవపురంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అందులో జిల్లాకు చెందిన ఓ తహసీల్దార్ ఉన్నట్లు ఎస్సై కట్ట శారదా సతీష్‌ తెలిపారు.

mro-caught-playing-poker-in-east-godavari-district
పేకాడుతూ పట్టుబడిన తహసీల్దార్​..

MRO arrest for playing cards: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలోని రాఘవపురంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడిచేసి కొందరిని అదుపులోకి తీసుకోగా.. అందులో జిల్లాకు చెందిన ఓ తహసీల్దారు ఉన్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

రాజమహేంద్రవరం అర్బన్‌ ఎస్పీ ఆదేశాలతో పోలీసు ప్రత్యేక బృందం ఆదివారం రాత్రి పేకాట ఆడుతున్నవారిని పట్టుకుంది. ఆ బృందం ఇచ్చిన నివేదిక ప్రకారం కోరుకొండ పోలీసుస్టేషన్‌లో పది మందిపై కేసు నమోదు చేశారు. వారిలో జిల్లాలోని ఓ మండలానికి చెందిన తహసీల్దారు ఉన్నారు. దీనిపై ఎస్సై కట్టా శారదా సతీష్‌ను వివరణ కోరగా.. వారిలో తహసీల్దార్​ ఉన్నట్లు నిర్ధారించారు.

ABOUT THE AUTHOR

...view details