తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యాటక బోటు కంట్రోల్ రూం ప్రారంభోత్సవంలో ఎంపీ భరత్‌రామ్ వర్గీయులు తీవ్ర నిరసనకు దిగారు. కంట్రోల్ రూం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రజా ప్రతినిధుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందులో ఎంపీ భరత్‌రామ్ ఫొటో లేకపోవడంతో ఆయన వర్గీయులు తీవ్ర నిరసన తెలిపారు. పర్యాటక అధికారులతో వాగ్వాదానికి దిగారు. అందరి ఫొటోలు వేసి.. ఎంపీ విషయంలో ప్రోటోకాల్ పాటించలేదని, కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ కూడా హాజరయ్యారు. ముఖ్యమంత్రితో వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కేంద్రాన్ని ప్రారంభించాల్సి ఉంది. అదే సందర్భంలో వారు ఆందోళనకు దిగడంతో..చివరికి ఎంపీ నచ్చజెప్పగా వారు ఆందోళన విరమించారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అతనో ఎంపీ అని మరిచిపోయారా..? - రాజమహేంద్రవరంలో ఎంపీ భరత్‌రామ్ వర్గీయుల ధర్నా
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యాటక బోటు కంట్రోల్ రూం ప్రారంభోత్సవంలో ఎంపీ భరత్‌రామ్ వర్గీయులు తీవ్ర నిరసనకు దిగారు. కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజా ప్రతినిధుల ఫ్లెక్సీల్లో ఎంపీ భరత్‌రాం ఫొటో లేదంటూ ఆయన వర్గీయులు అధికారులతో వాగ్వాదానికి దిగారు.
రాజమహేంద్రవరంలో ఎంపీ భరత్‌రామ్ వర్గీయుల నిరసన