రాజమహేంద్రవరం నగరానికి అవుటర్ రింగ్ రోడ్డు కి సంబంధించి ఆలోచన చేస్తున్నామని ఎంపీ భరత్ రామ్ తెలిపారు.తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గంలో ని రహదారులను అధికారులతో కలిసి పరిశీలించారు. గత ప్రభుత్వంలో మోరంపూడి జంక్షన్ వద్ద వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఆ నిధులను రద్దుచేసినందుకు వారు సిగ్గుపడాలి అన్నారు. ఈ ఏడాదిలో దానికి సంబంధించిన నిధులు, వేమగిరి వంతెనను సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. రాజమహేంద్రవరాన్ని ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తీసుకు వచ్చేందుకు వైకాపా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
రాజమహేంద్రవరం నగరానికి అవుటర్ రింగ్ రోడ్డు - రాజమహేంద్రవరంలో రహదారులను పరిశీలించిన ఎంపీ భరత్ రామ్
రాష్ట్రంలోని రహదారులన్నీ అభివృద్ధి చేసేందుకు వైకాపా ప్రభుత్వం దృఢసంకల్పంతో ఉందని ఎంపీ భరత్ రామ్ తెలిపారు. రాజమహేంద్రవరంలో దివాన్ చెరువు గ్రామన్ వంతెనకు సంబంధించి రహదారిని అభివృద్ధి చేసేందుకు 25 కోట్లు శాంక్షన్ చేశామని అన్నారు.
రాజమహేంద్రవరం నగరానికి అవుటర్ రింగ్ రోడ్డు