ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుమార్తెను చంపిన తల్లి - సహకరించిన అమ్మమ్మ - ఆడపిల్ల అని చంపిన అమ్మమ్మ

Mother, Grand Mother Killed Baby in East Godavari District : పిల్లలు లేని కుమార్తె కళ్లలో ఎలాగైనా ఆనందం చూడాలని ఎంతోమంది అమ్మలు ఆరాటపడుతుంటారు. ఇందుకోసం ఏదైనా చేస్తారు. క్యాన్సర్​తో చనిపోయిన కుమార్తెను మరిచిపోలేక బిడ్డ విగ్రహంతో కాలం గడుపుతుందో మాతృమూర్తి. కుమార్తెకు గుడి కట్టి తననే దేవతామూర్తిగా కొలుస్తున్న తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లలే ప్రాణంగా భావించి బతికే అమ్మానాన్నలు కోకొల్లలు. ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే. మరోవైపు కన్న కూతుర్ని కడతేర్చిన కఠినాత్ములు లేకపోలేరు. నవ మాసాలు మోసిన తల్లే తన పిల్లల భవితను చిదిమేసిన ఘటనలూ ఉన్నాయి.

mother_grand_mother_killed_baby_in_east_godavari
mother_grand_mother_killed_baby_in_east_godavari

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 27, 2023, 5:58 PM IST

Mother, Grand Mother Killed Baby in East Godavari District :ముగ్గురు అమ్మలు ఓ ఆడపిల్ల జీవితాన్ని పక్షం రోజుల్లోనే ముగించారు. పసికందు తల్లి, అమ్మమ్మే తన పాలిట మృత్యువులయ్యారు. ఏమీ ఎరగనట్టు తమ పాపను రాత్రికి రాత్రే ఎవరో అపహరించుకుపోయారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా ఫిర్యాదు చేసిన వారే నేరస్థులు అని రుజువు అయ్యింది. మృతి చెందిన పసికందు తల్లి, అమ్మమ్మలకు కోర్టు జీవిత ఖైదు అమలు చేసింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా సీతా నగరంలో జరిగింది.

ఆడపిల్ల పుట్టిందని అమానుషం.. సజీవంగా పొలంలో ఖననం.. రక్షించిన రైతు

Baby Girl Murder :మొదటి కాన్పులోనే ఆడబిడ్డ పుట్టడంతో పసిపాప తల్లి సహా ఆ కుటుంబంలోని ఇద్దరు మహిళలు ఆ పసికందును ప్రాణాలతోనే ఇంటి పరిసరాల్లోని నూతిలో పడేశారు. ఆ బిడ్డ అపహరణకు గురైనట్లు స్థానిక పోలీసులకు తప్పుడు ఫిర్యాదు ఇచ్చారు. ఈ కేసులో బిడ్డ తల్లికి, ఆమె తల్లికి జీవితఖైదు సహా జరిమానా విధిస్తూ రాజమహేంద్రవరం ఫ్యామిలీ కోర్టు కమ్‌ తొమ్మిదో అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి ఎం.మాధురి మంగళవారం తీర్పునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ సీఐ జి.ఉమామహేశ్వరరావు వెల్లడించిన ఈ తీర్పులోని వివరాల ప్రకారం సీతానగరం మండలం చినకొండేపూడి శివారు కొత్తూరుకు చెందిన కాళ్ల సృజన (21)కు మొదటికాన్పులో ఆడబిడ్డ పుట్టింది. ఆడబిడ్డ ఇష్టం లేని సృజన, ఆమె తల్లి మల్లిరెడ్డి మహాలక్ష్మి, సృజన అమ్మమ్మ గంధం కనకరత్నం ముగ్గురూ కలిసి 2020 జూన్‌ 19న 15 రోజుల వయసు గల పసికందును ఇంటి పక్కనే ఉన్న బావిలో ప్రాణాలతోనే పడేశారు. పొత్తిళ్లలో ఉన్న పసికందును ఎవరో దుండగులు తెల్లవారేసరికి అపహరించుకు పోయారని వారే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై అప్పడు సీఐగా ఉన్న పవన్‌కుమార్‌ రెడ్డి, ఎస్సై శుభశేఖర్‌ విచారణ చేపట్టారు. పోలీసు జాగిలాలు బావి చుట్టూనే తిరగడంతో, అనుమానం వచ్చిన పోలీసులు ఆ నూతిలోకి దిగి పరిశీలించారు. బావిలో పసికందు మృతదేహం కనిపించింది.

నవజాత శిశువుకు వీధి శునకం రక్షణ- రాత్రంతా..!

Three Womens Killed Baby Girl : అనుమానం వచ్చిన పోలీసులు ఇంట్లో వారిని విచారించారు. ఈ క్రమంలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లో మగవాళ్లంతా నిద్ర పోతుండగా ముగ్గురు మహిళలు కలిసి పసికందును నూతిలో పడేసినట్లు అంగీకరించారు. ఈ కేసు విచారణలో ఉండగానే నింధితురాలు గంధం కనకరత్నం(72) మృతి చెందారు. దీంతో పసిబిడ్డ తల్లి సృజనకు, ఆమె తల్లి మల్లిరెడ్డి మహాలక్ష్మికి జీవితఖైదు, రూ.18వేల జరిమానా, నేరాన్ని దాచిపెట్టి, తప్పుదోవ పట్టించినందుకు మరో ఏడాదిపాటు అదనంగా జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి మాధురి తీర్పునిచ్చారు. పబ్లిక్‌ ప్రాష్యిక్యూటర్‌గా ఎం.ఎ. భాషా వాదించారు. సాక్షులను సకాలంలో ప్రవేశపెట్టినందుకు కోర్టు కానిస్టేబుల్స్‌ బి. లక్ష్మణరావు, బీఎం షరీఫ్‌లను జిల్లా ఎస్పీ అభినందించారు.

ఆడపిల్ల పుట్టిందని.. భార్యనే వద్దన్న బ్యాంకు మేనేజర్..!

ABOUT THE AUTHOR

...view details