తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం కొత్తలంక గ్రామంలో సాయిలక్ష్మి అనే మహిళ ఒకేసారి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో ఇద్దరు మగ శిశువులు కాగా.. ఒకరు ఆడ శిశువు. శిశువులు ముగ్గురూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఒకేసారి ముగ్గురు పిల్లలకు పుట్టడంపై తల్లిదండ్రులు, వారి కుటుంబీకులు ఆనందం, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులను చూసి ముచ్చటపడుతున్నారు. శిశువులను చూసేందుకు చాలా మంది తరలి వస్తుండటంతో ఆసుపత్రిలో సందడి వాతావరణం నెలకొంది.
ఒకే కాన్పులో ముగ్గురు పండంటి శిశువులు! - rajamundry
ఒకే కాన్పులో ముగ్గురు పండంటి పిల్లలు పుట్టారు. ఈ అరుదైన ఘటన అమలాపురం రోహిణీ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ముగ్గురు శిశువులు ఆరోగ్యంగా ఉన్నారు.
ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు