ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లంక గ్రామాలకు మరోసారి వరద ముప్పు

తూర్పుగోదావరి జిల్లాలోని లంక గ్రామాలను మరోసారి వరద చుట్టుముట్టింది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి భారీగా నీటిని విడుదల చేయటంతో ఇక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

More than three lakh cusecs of water was released from Dhawaleswaram barrage
More than three lakh cusecs of water was released from Dhawaleswaram barrage

By

Published : Sep 2, 2020, 8:20 PM IST

యానాం సముద్రతీరంలో

గోదావరి నదికి వరద నీరు వచ్చి చేరుతోంది. తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజీ నుంచి మూడు లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీనివల్ల నదీ పరివాహక ప్రాంతాలు మరోసారి ముంపునకు గురవుతున్నాయి.

2 వారాల క్రితం వరద వల్ల చేరిన చెత్త... బురదను పూర్తిగా తొలగించకముందే మళ్లీ నీరు రావటంతో లంక గ్రామాల్లోని ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మరోవైపు కేంద్ర పాలిత ప్రాంతం యానాం రాజీవ్ బీచ్​లోని చెత్త, ఇసుక మేటలను కూలీలతో తొలగించే పనులు చేపట్టారు మున్సిపల్ అధికారులు.

ABOUT THE AUTHOR

...view details