Monkeys Deadbodies: పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కేపీ పాలెం సౌత్ సముద్ర తీరంలో కోతుల కళేబరాలతో కలకలం రేగింది. ఈ ప్రాంతంలోని సరివి తోటల్లో సుమారు వందకు పైబడి కోతుల కళేబరాలు ఉన్నాయి. నరసాపురం నియోజకవర్గంతోపాటు, ఉభయ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఇటీవల కోతుల బెడద బాగా ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో ఎవరైనా విష ప్రయోగం చేసి వాటిని వాహనాలపై ఇక్కడకు తీసుకువచ్చి వదిలి ఉంటారని ఈ ప్రాంతవాసులు భావిస్తున్నారు. విష ప్రయోగంతో కొన్ని కోతులు మృత్యువాత పడి ఉంటాయని, వాటిలో కొన్ని బతికి ఇక్కడ సంచరిస్తున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
సముద్ర తీరంలో కోతుల కళేబరాలు.. విష ప్రయోగం చేశారా..! - Monkeys are a nuisance
Carcasses: కేపీపాలెం సౌత్ సముద్రతీరంలో కోతుల కళేబరాలతో కలకలం రేగింది. ఈ ప్రాంతంలోని సరివి తోటల్లో సుమారు వందకు పైబడి కోతుల కళేబరాలు ఉన్నాయి.
తీరంలో కోతుల కళేబరాలతో కలకలం