ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మోదీకి బాబు సవాల్​! ఎవరేమి చేశారో చర్చకు సిద్ధమా? - చంద్రబాబు

వైసీపీతో కలిసి రాష్ట్రాన్ని దోచుకోవడానికి మోదీ ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న ఆయన దేశానికి మీరేం చేశారో... ఏపీకి నేనేం చేశానో చర్చిద్దామా అని సవాల్ విసిరారు.

చంద్రబాబు ప్రచారం

By

Published : Mar 31, 2019, 4:05 PM IST

చంద్రబాబు ప్రచారం
రాష్ట్రాన్ని అన్ని విధాలా మోసం చేసిన వ్యక్తి నరేంద్రమోదీ అని చంద్రబాబు విమర్శించారు. కోడికత్తి పార్టీ వైసీపీతో కలిసి రాష్ట్రాన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న ఆయన... విశాఖ రైల్వేజోన్ పేరుతో మోదీ తలలేని మెుండెం ఇచ్చారని ఆక్షేపించారు. సీబీఐ, ఐటీ, ఈడీ దాడులకు మేము భయపడమన్నారు. దేశానికి మీరేం చేశారో... ఏపీకి నేనేం చేశానో చర్చిద్దామా అని సవాల్ విసిరారు. కేసీఆర్ సూచన మేరకే జగన్ వైకాపా అభ్యర్థుల్ని ఎంపిక చేశారని ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details