ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దిల్లీ పర్యటనకు ఇచ్చే ప్రాముఖ్యత రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం లేదు' - peddapuram weather news

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పర్యటించారు. వరదతో దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించారు.

MLA nimmakayala china rajappa tour in peddapuram east godavari district
ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప

By

Published : Oct 14, 2020, 11:54 PM IST

తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలంలో వరదల ధాటికి దెబ్బతిన్న పంట పొలాలను స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పరిశీలించారు. ప్రకృతి విలయతాండవం చేస్తున్నా... ముఖ్యమంత్రి దిల్లీ పర్యటనకు ఇచ్చే ప్రాధాన్యతను రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం లేదని మండిపడ్డారు.

తెదేపా హయాంలో.. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు భరోసా ఇచ్చేవారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని, పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details