ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్ప్ డెస్క్ ప్రారంభం - పి గన్నవరం నుంచి బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు

సీఎం జగన్ బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పించారని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. కార్పొరేషన్ డైరెక్టర్లుగా నియమితులైన వారిని సత్కరించి అనంతరం అభినందన ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుందని ఎమ్మెల్యే చిట్టిబాబు తెలిపారు.

వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్ప్ డెస్క్ ప్రారంభం
MLA kondeti Chittibabu

By

Published : Oct 21, 2020, 3:42 PM IST

బీసీ సామాజిక వర్గాలకు వైకాపా ప్రభుత్వం సముచిత స్థానం కల్పించిందని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేయటం అభినందనీయమని ప్రశంసించారు. పి గన్నవరం నియోజకవర్గం నుంచి రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ గా బుర్ర పాలెపు సత్యనారాయణ , దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ గా షేక్ మస్తాన్ సాహెబ్ , సూర్య బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ గా మద్దుల వరలక్ష్మి , మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్ గా చింత కుమారి నియమితులవగా.. వారిని అభినందించారు.

వీరిని ఎమ్మెల్యే సత్కరించి.. పి గన్నవరం లో అభినందన ర్యాలీ నిర్వహించారు. అలాగే పి గన్నవరం సామాజిక ఆసుపత్రిలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్ప్ డెస్క్ ను ప్రారంభించారు. ఈ పథకం ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుందని ఎమ్మెల్యే చిట్టిబాబు తెలిపారు. ప్రజలకు కావలసిన వైద్య సమాచారం హెల్ప్ డెస్క్ వద్ద లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details