తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో 30 పడకల ఆసుపత్రిగా ఉన్న సామాజిక ఆసుపత్రి... 50 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ అయిందని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి భవనాన్ని 50 పడకల ఆసుపత్రి భవనంగా అభివృద్ధి చేసేందుకు మూడు కోట్ల రూపాయల నిధులతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన నియోజకవర్గంలోని వీరవల్లిపాలెం ముక్కామల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఈ నిధులతో నిధులతో కొత్త భవనాలు నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు.
సామాజిక ఆసుపత్రి అభివృద్ది పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన - p.gannavaram Community Hospital latest news update
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలోని సామాజిక ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు రూ. 3 కోట్ల నిధులతో చేపట్టే పనులకు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు శంకుస్థాపన చేశారు.
అభివృద్ది పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
ఇవీ చూడండి...