తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం లంక గ్రామాల్లో వరద నీరు పోటెత్తటంతో.. పశుగ్రాసం పూర్తిగా మునిగిపోయింది. దీంతో పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో పాడి రైతులకు ఉచితంగా పశువుల దాణా అందజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే పాల్గొని రైతులకు.. దాణా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులను అన్నివిధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పంట పొలాల్లో వరద నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు.
రైతులను అన్నివిధాల ఆదుకుంటాం: ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి - mla chirla jaggireddy visit lanka villages
పంటపొలాల్లో వరద నష్ట అంచనా వేయాలని, తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆదేశించారు. లంక గ్రామ ప్రజలకు పశువుల దాణా పంపిణీ చేసిన ఎమ్మెల్యే, రైతులను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి