ప్రజాసంక్షేమమే వైకాపా ప్రభుత్వ లక్ష్యమని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం, ఆత్రేయపురం మండల్లాలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. వెదిరేశ్వరంలో ఉపాధి హామీ పథకం నిధులు రూ.76.50 లక్షలతో నిర్మించనున్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ భవనాలకు శంకుస్థాపన చేశారు.
పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జగ్గిరెడ్డి శంకుస్థాపన
తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెం, ఆత్రేయపురం మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, సీసీ రహదారుల వంటి అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు.
70 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్, రూ.16 లక్షలతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీగోడ, రూ.80 లక్షలతో గ్రామంలో సీసీ రహదారులు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే జగ్గిరెడ్డి చెప్పారు. ఆత్రేయపురం మండలం మెర్లపాలెం గ్రామంలో రూ. 76.75 లక్షలతో నూతనంగా నిర్మించనున్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, మరియు వెల్నెస్ సెంటర్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం పాడి రైతులకు ఉచితంగా మందులు అందించారు.
ఇదీ చదవండి :పాలకొల్లులో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠా అరెస్టు