తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కట్టడి, బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కలెక్టర్ నేతృత్వంలో.. జిల్లా యంత్రాంగం ఆదర్శనీయమైన వార్‌రూమ్ కాన్సెప్ట్‌ను రూపొందించి, అమలు చేస్తోందని మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. తుని ప్రభుత్వ ఆసుపత్రిలోని కొవిడ్ వార్డును ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తిలతో కలిసి మంత్రి సందర్శించారు. కరోనా బాధితులతో మాట్లాడి వారిలో ధైర్యం నింపారు. ఈ సందర్భంగా దివీస్ లాబొరేటరీస్ అందించిన 60 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఆయన ప్రారంభించారు. తుని ఏరియా ఆసుపత్రికి 50, తొండంగి, కోటనందూరు పీహెచ్‌సీలకు అయిదు చొప్పున కాన్సంట్రేటర్లను దివిస్ అందించింది.
కరోనా కట్టడికి వార్‌రూమ్ కాన్సెప్ట్: మంత్రి వేణుగోపాలకృష్ణ - మంత్రి వేణుగోపాలకృష్ణ తాజా వార్తలు
తూర్పుగోదావరి జిల్లా తుని ప్రభుత్వ ఆసుపత్రిలోని కొవిడ్ వార్డును.. మంత్రి వేణుగోపాల కృష్ణ సందర్శించారు. కరోనా కట్టడి, బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు.. జిల్లా యంత్రాంగం ఆదర్శనీయమైన వార్‌రూమ్ కాన్సెప్ట్‌ను రూపొందించి, అమలు చేస్తోందని మంత్రి తెలిపారు.
minister venugopala krishna