తూర్పుగోదావరి జిల్లా మండపేటలో అహరణకు గురై క్షేమంగా ఇంటికి చేరిన బాలుడు జషిత్‌ను.. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పరామర్శించారు. తల్లిదండ్రులతో మాట్లాడారు. అపహరణకు గురైనా భయపడని బాలుడి ధైర్యాన్ని మెచ్చుకున్నారు. పోలీసులు సమర్థంగా పనిచేశారని మంత్రి ప్రశంసించారు. త్వరలోనే నిందితులని పట్టుకుంటామని ఉప ముఖ్యమంత్రి అన్నారు. ఈ సందర్భంగా.. ఉప ముఖ్యమంత్రితో చిన్నారి జషిత్ ముచ్చట.. ఆకట్టుకుంది. కిడ్నాపర్లు నీకు అన్నం పెట్టారా అని పిల్లి సుభాష్ చంద్రబోస్ అడిగితే.. పెరుగన్నం పెట్టారు సార్.. ఇడ్లీ పెట్టి పంచదార వేశారు సార్.. అంటూ జషిత్ ముద్దుముద్దుగా సమాధానం చెప్పాడు.
హాయ్ జషిత్.. బాగున్నావా?
అపహరణకు గురై క్షేమంగా తిరిగొచ్చిన జషిత్‌ని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పరామర్శించారు.
జషిత్‌ను పరామర్శించిన మంత్రి పిల్లి సుభాష్