బుధవారం రాత్రి గుండెపోటుతో కన్నబాబు సోదరుడు సురేష్ ఆకస్మికంగా మృతి చెందారు. ప్రజాప్రతినిధులు, వైకాపా నాయకులు సురేశ్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. మంత్రి కన్నబాబు, వారి కుటుంబ సభ్యులు సురేష్ భౌతిక కాయంవద్ద విలపించారు. చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడాన్ని జీర్ణించుకోలేక పోయారు. కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షించారు. సురేశ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గతంలో పాత్రికేయుడిగా పనిచేసిన సురేష్ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు. ఎన్నికల సమయంలో సురేష్ కన్నబాబుకు వెన్నంటి నిలిచారు. సీఎం జగన్... కన్నబాబు సోదరుడి మృతిపట్ల సంతాపం తెలిపారు. కన్నబాబుకు ఫోన్ చేసి పరామర్శించారు. కాసపేట్లో కాకినాడలో అంత్యక్రియలు జరగనున్నాయి.
మంత్రి కన్నబాబు ఇంట్లో విషాదం - jagan
తూర్పుగోదావరి జిల్లా రమణయ్యపేటలోని మంత్రి కన్నబాబు నివాసంలో వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన సోదరుడు సురేశ్ మృతి చెందారు.
minister_kurasala_kannababu_brother_died_with_heart_attack