పోలవరం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్పై నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. లోకేశ్ సంస్కారం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం తగదని హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేది జగన్మోహన్ రెడ్డేనని అన్నారు. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులు గుర్తు రాలేదా అని నిలదీశారు. ప్రాజెక్టుకు సంబంధించి 2,300 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా..1200 కోట్లతో ప్రాజెక్టు పనులను తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని వ్యాఖ్యనించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టును ఎటీఎంల మాదిరి వాడుకుంటున్నారని సాక్షాత్తూ ప్రధానమంత్రి మోదీ అన్నారని గుర్తు చేశారు. 2024లో అధికారంలోకి వస్తామని లోకేశ్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.
నిర్వాసితులను ఆదుకుంటాం
పోలవరం నిర్వాసితుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తుందని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. ఒకొక్క నిర్వాసిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. రెండేళ్ల కాలంలో నిర్వాసితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 16 వేల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసిందని వెల్లడించారు. మొత్తం 1,02,491 ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని మంత్రి వివరించారు. నాణ్యతా ప్రమాణాలతో ఆర్అండ్ఆర్ కాలనీల నిర్మాణం జరుగుతోందని...,ఈ అంశాల పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ ఐఏఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా..ఆర్అండ్ఆర్ కాలనీలకు సంబంధించి బిల్లులను పెండింగ్‌లో ఉంచొద్దని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించినట్లు తెలిపారు. వివిధ అంశాల్లో నిర్వాసితులకు శిక్షణ ఇచ్చి సుస్థిర ఉపాధిని కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఎరువుల కొరత లేదు