రాష్ట్ర వ్యవసా0య శాఖ మంత్రి కురసాల కన్నబాబు నిరాశ్రయులైన మత్స్యకార మహిళలకు ఫైబర్ ఐస్ బాక్సులను పంపిణీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. రమణయ్యపేట చేపల మార్కెట్ లో వ్యాపారం చేసుకునే మహిళలు... రెండుసార్లు అగ్నిప్రమాదం జరగడంతో నిరాశ్రయులయ్యారని మంత్రి కన్నబాబు అన్నారు. మత్స్య శాఖ అధికారుల సూచన మేరకు లక్ష రూపాయలు విలువ చేసే ఐస్ బాక్స్ లు మహిళలకు అందజేశామన్నారు.
మత్స్యకార మహిళలకు ఐస్ బాక్సులు అందజేత
నిరాశ్రయులైన మత్స్యకార మహిళలకు అండగా ఉంటామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. నిరాశ్రయులైన మత్స్యకార మహిళలకు ఫైబర్ ఐస్ బాక్సులను మంత్రి అందజేశారు.
మత్స్యకార మహిళలకు ఐస్ బాక్సులు అందజేసిన మంత్రి కన్నబాబు