తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం లంక గ్రామాల ప్రజలు ఇటీవల వచ్చిన వరదల కారణంగా గ్రామస్తులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చుట్టూ నీరున్నా అవి తాగేందుకు ఉపయోగకరంగా లేకపోవడంతో...యాభై రూపాయలు పెట్టి టిన్నులు కొనుగోలు చేసి దాహార్తి తీర్చుకోవలసి పరిస్థితి వచ్చింది. ఇది గమనించిన స్థానిక ఆక్వా చెరువులు ఉత్పత్తుల వ్యాపారి సతీష్ రాజు...సహృదయంతో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. 5 లక్షల వ్యయంతో...అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి... కేవలం రెండు రూపాయలకే ఇరవైలీటర్ల మంచి నీటిని ఇచ్చేలా ఏర్పాటు చేశారు. వాటర్ ప్లాంట్ను స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ ప్రారంభించారు.
రెండు రూపాయలకే 20లీటర్ల నీళ్లు
తూర్పుగోదావరి జిల్లాలో వరదల కారణంగా లంక గ్రామాల ప్రజలు తాగునీటి కష్టాలు ఎదుర్కుంటున్నారు. చుట్టూ నీరున్నా...కుళాయిల నుంచి సరఫరా చేసే నీరు మురికిగా వస్తుండటంతో అవి తాగడానికి ఉపయోగపడట్లేదు. వారి కష్టాలను చూసి ఆక్వా చెరువులు ఉత్పత్తుల వ్యాపారి...నూతన పరిజ్ఞానంతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు.
వాటర్ ప్లాంట్ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్