ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మండపేటలో మెగా మెడికల్ క్యాంప్ - మండపేటలో మెగా మెడికల్ క్యాంప్

మండపేట లో వేగుళ్ళ సూర్యారావు చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో మెగా మెడికల్ క్యాంప్​ ఏర్పాటు చేశారు. టీం సురక్ష ఆధ్వర్యంలో 50వ మెగా మెడికల్ క్యాంపు, ఆలమూరు రోడ్డులోని అన్నపూర్ణ స్కూల్ ఆవరణంలో నిర్వహించనున్నారు. లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి సురక్ష టీమ్ సేవలు అద్భుతమని ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు.

Mega Medical Camp
మెగా మెడికల్ క్యాంపు

By

Published : Oct 19, 2020, 3:10 PM IST

తూర్పు గోదావరి జిల్లా మండపేటలో వేగుళ్ళ సూర్యారావు చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో మెగా మెడికల్ క్యాంప్​ ఏర్పాటు చేశారు. వేగుళ్ళ మాధవి బాబు, వేగుళ్ళ పట్టాభిరామన్న చౌదరి, వేగుళ్ళ చైతన్య బాబు సంయుక్తంగా టీం సురక్ష ఆధ్వర్యంలో 50 వ మెగా మెడికల్ క్యాంపు ఆలమూరు రోడ్డులోని అన్నపూర్ణ స్కూల్ ఆవరణంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెదేపా ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పాల్గొన్నారు.

లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి సురక్ష టీమ్ సేవలు అద్భుతమని ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. కరోనా వైరస్ కి ప్రజలందరూ భయపడుతుంటే సురక్ష టీం మాత్రం ప్రతీ ఒక్కరికీ వైద్య సూచనలు, సలహాలతో పాటు మందులను పంపిణీ చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున ప్రజలు పాల్గొని వైద్యసేవలను పొందారు.

ABOUT THE AUTHOR

...view details