పెళ్లంటే.. ఒకప్పుడు బంధువులు, స్నేహితులు.. అదో హడావుడి. కానీ కరోనా కాలంలో అలా కుదరదు కదా! ఎలాగైతేనేం అందరూ జాగ్రత్తగా ఉండాలనుకున్నాడో ఓ ఉపాధ్యాయుడు. తన కుమారుడి పెళ్లిలో మాస్కులు పంపిణీ చేశాడు. అందరూ తప్పకుండా మాస్కులు ధరించి.. సురక్షితంగా ఉండాలని సందేశాన్నిచ్చాడు.
'మాస్కులు ధరించండి.. మమ్మల్ని ఆశీర్వదించండి'
ఎదురింటోళ్లు.. పెళ్లి పత్రికను గొప్పగా ప్రింట్ చేశారు. వెనకింటి వాళ్ల కొడుకు పెళ్లి పత్రిక డిజైన్ బాగుంది. ఇలాంటివి చాలా విన్నాం.. చూశాం కదా! ఓ కుటుంబం మాత్రం పెళ్లి పత్రికంటే బాధ్యత అనుకుంది. కరోనా కాలంలో మాస్కులనే ఆహ్వాన పత్రికలుగా మార్చింది.
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు కొవ్వూరి సత్తిరెడ్డి కుమారుడు కిరణ్కు.. కొమరిపాలెం గ్రామానికి చెందిన లక్ష్మితో వివాహం కుదిరింది. సోమవారం తమ గ్రామంలో నిరాడంబరంగా వివాహం చేశారు. అయితే తన కుమారుడి పెళ్లికి బంధువులు, గ్రామస్థులు రాకపోయినా.. ఇంట్లోనే ఉండి దీవెనలు అందించాలి అని కోరాడు సత్తిరెడ్డి. నూతన వధూవరుల పేర్లతో కూడిన మాస్కులు తయారు చేయించారు. గ్రామస్థులతోపాటు పెళ్లికి వచ్చినవారికి పంచిపెట్టారు. బయటకు వచ్చేప్పుడు మాస్కులు ధరించాలని సత్తిరెడ్డి విజ్ఞప్తి చేశాడు.
ఇదీ చదవండి:కరోనా నేర్పిన పాఠం: విద్యకు సాంకేతిక దన్ను