మామిడి కాయలు కొమ్మలకు కాయడం సాధారణం. అవే కాయలు.. కాండానికి కాచి అది కూడా గుత్తులుగా ఉంటే? ఎంతో అరుదైన విషయం కదా. తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని గూడపల్లి గ్రామానికి చెందిన సుందర రామ సుధాకర్ ఇంటి ఆవరణలో ఈ వింత జరిగింది.
చెరకు రసాల మామిడి చెట్టు కాండం అడుగుభాగంలో గుత్తులు గుత్తులుగా కాచి చూపరులను అబ్బురపరుస్తోంది. ఆ కాయలు చూస్తే... నేల మీద నుంచి వచ్చినట్లుగానే కనిపిస్తున్నాయి. గుత్తులుగా ఉన్న ఆ కాయలు పడిపోకుండా వాటికి కర్ర పుల్లలు అడ్డుగా పెట్టారు.