తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక వద్ద గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఒక మత్స్యకారుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక గ్రామానికి చెందిన జల్లి నాగేశ్వరరావు(43) పిచ్చుకలంక వద్ద ఉన్న బ్యారేజీ వద్ద.. గోదావరిలో చేపల పట్టేందుకు వెళ్లాడు. చేపలు పట్టే సమయంలో ప్రమాదవశాత్తు గోదావరిలో పడిపోగా.. కాళ్లకు చేపల వల చుట్టుకుని నీటిలో మునిగి దుర్మరణం పాలయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి కేసు నమోదు చేసుకున్నారు.
DEAD: చేపల వేటకు వెళ్లి.. ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి - చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
తూర్పుగోదావరి జిల్లాలో చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
DEAD